రుణయాప్‌ల వేధింపులకు మరో నిండు ప్రాణం బలయింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా తాజాగా పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవసరాల కోసం 9 రుణయాప్‌ల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు రుణాన్ని తీసుకున్న చంద్రమోహన్.. వాటిని తిరిగి కట్టలేకపోయారు.
దా'రుణ' యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య - మేడ్చల్ జిల్లా లేటెస్ట్ వార్తలు
14:31 January 02
దా'రుణ' యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
రుణయాప్‌ల కాల్ సెంటర్ల నుంచి వేధింపులు రావటంతో జాతీయ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. అతనికి మల్కాజిగిరిలోని ఓ కార్యాలయం వద్ద కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే చంద్రమోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేడ్చల్‌లోని ఓ గోదాంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న చంద్రమోహన్ కొన్నేళ్ల క్రితం.. స్వస్థలం కామారెడ్డి నుంచి గుండ్లపోచంపల్లికి జీవనోపాధి కోసం వచ్చారు. ఇతనికి భార్య సరిత ముగ్గురు కూతుళ్లు వర్షశ్రీ, సాయి శ్రీ, అనన్యశ్రీ ఉన్నారు.
సీబీఐ సెక్యూరిటీ పేరుతో వాట్సాప్ సందేశాలు
ఈరోజు ఉదయం భార్య సరిత విధులకు వెళ్లిన సమయంలో వైర్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అసభ్యపదజాలంతో కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ వేధింపులకు గురిచేశారని మృతుని భార్య సరిత వాపోయింది. కుటుంబ సభ్యులందరికీ నకిలీ సీబీఐ సెక్యూరిటీ పేరుతో వాట్సాప్ సందేశాలు, ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేశారని ఆమె వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 యాప్‌ల్లో చంద్రమోహన్ రుణం తీసుకున్నట్లు తెలిసిందని బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:దా'రుణ' యాప్‌ల వెనుక మహిళ హస్తం: ఏసీపీ