తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏఆర్ కానిస్టేబుల్ గంజాయి సరఫరా కేసులో మరొక వ్యక్తి అరెస్ట్​

గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డ అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహనకృష్ణ కేసులో పరారీలో ఉన్న మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 66 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Another man arrested in AR constable marijuana supply case
ఏఆర్ కానిస్టేబుల్ గంజాయి సరఫరా కేసులో మరొక వ్యక్తి అరెస్ట్​

By

Published : Dec 19, 2020, 7:11 PM IST

అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డ అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహనకృష్ణ కేసులో పరారీలో ఉన్న మరొక నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 11న ఉప్పల్​లోని నల్ల చెరువు వద్ద విశాఖపట్నం, నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మోహన్ కృష్ణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మోహన్ కృష్ణని కస్టడీలోకి తీసుకొని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పరారీలో ఉన్న బొంతు రాజు అనే నిందితున్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 6 లక్షలు విలువ చేసే 66 కిలోల గంజాయి, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు.

ఇదీ చూడండి:రవాణా వాహనంపై విద్యుత్​ తీగలు పడి ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details