హైదరాబాద్‌లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం - హైదరాబాద్‌లో హిజ్రాపై హత్యాయత్నం

19:59 October 12
హైదరాబాద్‌లో హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో వర్గం
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో హిజ్రాపై మరో వర్గం పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఎర్రగడ్డ అవంతినగర్‌కు చెందిన హంసకు చందానగర్‌లోని హిజ్రాలతో విభేదాలున్నాయి. విభేదాల విషయంలో మాట్లాడుకుందామని హంసకు మరో వర్గం పిలిచింది. నిన్న రాత్రి హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ వద్దకు రావాలని సమాచారం ఇచ్చింది.
హంసపై మరో వర్గం హిజ్రాలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయారు. బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :బాలికకు ఏడో నెలలోనే ప్రసవం చేసిన తల్లి... తల్లీశిశువు మృతి