వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈ నెల13న కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. కల్తీ కల్లు ఘటనలో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది.
వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి - కల్తీ కల్లుతో మృతి

13:40 January 18
వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి
వారం రోజుల క్రితం మరణించిన ఇద్దరు కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందినట్లు అబ్కారీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వారి నమూనాలను ఎక్సైజ్ పరిశోధన కేంద్రంలో పరిక్షించగా అందులో ఆల్పాజోలం, డైజోఫాం కలిసినట్టు తేలింది.
మోతాదుకు మించి కల్తీ చేయడం వల్ల ముగ్గురు మరణించటమే కాకుండా... 350 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఘటనకు కారణమైన 15 దుకాణాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు... లైసెన్సులను రద్దు చేశారు.
ఇదీ చదవండి :కల్తీ కల్లు తాగడం వల్లే మరణించారు