కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. కీసర మండలం రాంపల్లిలో 48 కోట్ల రూపాయల విలువైన 24 ఎకరాల భూమికి సంబంధించి అక్రమంగా పట్టాపాస్ పుస్తకాలు నాగరాజు జారీ చేసినట్టు బయటపడడం వల్ల ఈ కేసు నమోదు చేశారు.
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై మరో కేసు నమోదు
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. రాంపల్లిలో రూ.48 కోట్ల విలువైన భూమికి పాసుపుస్తకాలు ఇచ్చినట్లు అనిశా అధికారులు తెలిపారు.
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై మరో కేసు నమోదు
ఆర్డీఓ వద్ద ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే నాగరాజు పాస్‌పుస్తకాలు జారీ చేసినట్టు వెల్లడైంది. ఆయన ఇందుకోసం అధికార దుర్వినియోగం చేశారని ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో మరోసారి అల్వాల్‌లోని మాజీ తహసీల్దార్ నాగరాజు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు తాజా కేసు నమోదు చేశారు.