వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు వంతెనలు కొట్టుకుపోతున్నాయి. తాండూర్ హైదరాబాద్ మార్గంలో తరచుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు తాండూర్ సమీపంలో రోడ్డు తెగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా మరో రోడ్డు వంతెన వరదనీటి కొట్టుకుపోయింది. జిల్లాలోని పెద్దేముల్లో రోడ్డు వంతెన తెగిపోయింది. రోడ్డుపై కొత్త వంతెన నిర్మించడానికి పాత వంతెన తొలిగించారు. వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా మరో మార్గం ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో బ్యాండ్ హైదరాబాద్ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడం వల్ల ఆ మార్గంలో రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఆర్టీసీ బస్సులతో పాటు.. ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తాండూరులో తెగిన మరో వంతెన.. రాకపోకలకు ఆటంకం
వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు వంతెనలు కొట్టుకుపోతున్నాయి. తాజాగా జిల్లాలోని పెద్దేముల్లో రోడ్డు వంతెన తెగిపోయింది. దీనితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడుతున్నాయి.
తాండూరులో తెగిన మరో వంతెన.. రాకపోకలకు ఆటంకం
తాండూర్ హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా బస్సులను దారి మళ్లీంచారు. తెగిపోయిన వంతెనలో వెంటనే పునర్నిర్మాణం చేసి రాకపోకలను కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'