తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేయసి మోసం చేసిందన్న కారణంతో యువకుడు ఆత్మహత్య

అనంతపురానికి చెందిన ప్రణయ్‌ అనే యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ యువతి తనను మోసం చేసిందని అందుకే భరించలేక చనిపోతున్నాని ...ఓ వీడియోను తలిదండ్రులకు పంపి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

Andhrapardesh  state anantapur-youth-suicide-in-canada-with-love-failure
ప్రేయసి మోసం చేసిందన్న కారణంతో యువకుడు ఆత్మహత్య

By

Published : Nov 16, 2020, 8:02 PM IST

ప్రేయసి దూరమవుతోందనే మనోవేదనతో అనంతపురానికి చెందిన ఓ యువకుడు కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబసభ్యులు, నాలుగో పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు వెల్లడించారు. అనంతపురంలోని కోవూరు నగర్‌కు చెందిన నారాయణ స్వామి కుమారుడు ప్రణయ్‌ (29) గత రెండేళ్లుగా కెనడాలో ఉంటున్నాడు. అక్కడే ఏపీకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. గత ఆరునెలలుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు అంగీకరించి కరోనా పరిస్థితుల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇంతలోనే కెనడాలో వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే అక్టోబర్‌ 11 నుంచి ప్రణయ్‌, ఆ యువతి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత యువతికి అమెరికా వెళ్లేందుకు వీసా లభించింది. అమెరికా వెళ్తున్నందున వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు యువతి చెప్పింది. అప్పటి నుంచి తనకు ప్రేయసి దూరమవుతోందని.. దీనికి తోడు మరో యువకుడితో పరిచయాలు కొనసాగిస్తోందని ప్రణయ్‌ భావించాడు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన ప్రణయ్‌.. విష వాయువు పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం శనివారం అనంతపురం చేరుకునే అవకాశమున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి:కిడ్నాపైన మూడేళ్ల పాప ఆచూకీ లభ్యం.. ఎందుకు అపహరించారంటే..

ABOUT THE AUTHOR

...view details