తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య - an youngster committed suicide in gudatipally

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

an youngster committed suicide due to financial problems in siddipet district
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

By

Published : Aug 25, 2020, 12:30 PM IST

తండ్రి చికిత్సకు చేసిన అప్పు ఓ వైపు, గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన ఇంటికి పరిహారం రాలేదనే బాధ మరోవైపు ఓ యువకుణ్ని బలితీసుకున్నాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లికి చెందిన బద్దం రాజు (25) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాజు కరోనా వల్ల ఉద్యోగం లేక, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన ఇల్లుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.18 లక్షల పరిహారం ఇంకా రాలేదు. ఏడాది క్రితం విద్యుత్ నియంత్రికకు ఫ్యూజ్​ వేస్తుండగా రాజు తండ్రి మల్లారెడ్డి ప్రమాదానికి గురయ్యాడు. రూ.10 లక్షల అప్పు చేసి అతనికి చికిత్స చేయించారు. అప్పుల బాధ, నిరుద్యోగంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details