యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని మల్లాపురం వెళ్లే దారిలో ఉన్న గండి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వైటీడీఏలో విధులు నిర్వహిస్తున్న కూలీలు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని జేసీబీ సహాయంతో బయటికు తీశారు. ముఖం గుర్తుపట్టలేని స్థితికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
గండి చెరువులో గుర్తు తెలియని శవం లభ్యం - యాదాద్రి క్రైమ్ న్యూస్
గుర్తు తెలియని శవం లభ్యమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పరిధిలోని గండిచెరువులో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గండి చెరువులో గుర్తు తెలియని శవం లభ్యం
మృతుడు ఎరుపు రంగు చొక్కా, నీలం రంగు ప్యాంట్ వేసుకున్నాడని.. ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.