వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పోచమ్మ కుంట వద్ద గల నాలాలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నాలాలో గుర్తుతెలియని మహిళ మృతదేహం.. కేసు నమోదు
హన్మకొండ పట్టణంలోని నాలాలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలాలో గుర్తుతెలియని మహిళ మృతదేహం.. కేసు నమోదు
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలాలో నుంచి తీసి.. శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు నాలాలో పడిందా? ఎవరైనా చంపి అందులో పడేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. పట్టణంలోని నాలాలో వరుసగా రెండో రోజూ మృతదేహం కొట్టుకురావటం వల్ల స్థానికులు భయాందోళన చెందుతున్నారు.