జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే పట్టణానికి చెందిన బొడ్డురాజు(35)అనే వ్యక్తి మృతి చెందాడు. చెల్పూరు నుంచి భూపాలపల్లికి బైక్పై వస్తుండగా వెనుక నుంచి వచ్చి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. కేసు నమోదు - భూపాలపల్లి తాజా వార్తలు
భూపాలపల్లి పట్టణ కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొనటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. కేసు నమోదు
తీవ్ర గాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీ సహాయంతో రాజును ఢీకొట్టిన వాహనాన్ని గుర్తిస్తామని ఎస్సై అభినవ్ తెలిపారు.
ఇదీ చూడండి :మేకల మందపై చిరుత దాడి.. భయాందోళనలో స్థానికులు