తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం - కామారెడ్డి జిల్లా నేర వార్తలు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతుడు కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన మాసుల సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

An unidentified man died under suspicious circumstances at rameswara palli in kamareddy
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Jan 5, 2021, 5:40 PM IST

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులోని రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన మాసుల సత్యనారాయణగా గుర్తించారు. మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు మృతుడిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి:అంబులెన్స్ ఢీ.. అనంతలోకాలకు ఛత్తీస్​గఢ్ యువకుడు!

ABOUT THE AUTHOR

...view details