తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యాదాద్రి జిల్లాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.. - Yadadri Bhuvanagiri Crime News

యాదాద్రి జిల్లాలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు... విచారించారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో.. దర్యాప్తు చేపట్టారు.

An unidentified body was found in Vangapalli village, Yadadri district
గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

By

Published : Oct 20, 2020, 10:39 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ శివారులోని రైస్​మిల్లు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. అక్కడికి వెళ్లిన పోలీసులు అతని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు.

ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ఎవరైనా హత్య చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:తాడ్వాయిలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details