ఆగని దా'రుణ'యాప్‌ల వేధింపులు.. రాష్ట్రంలో మరొకరు బలి - ONLINE LOAN APPS HARASSMENT NEWS

18:37 December 24
ఆగని దా'రుణ'యాప్‌ల వేధింపులు.. రాష్ట్రంలో మరొకరు బలి
రుణ యాప్‌ల వేధింపులు కారణంగా రాష్ట్రంలో మరో వ్యక్తి బలవాన్మరణానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం సైట్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న సంతోశ్‌కుమార్(36) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగారు.
పురుగుల మందు తాగడం వల్ల సంతోశ్ కుమార్ కోమాలోకి వెళ్లిన నేపథ్యంలో.. స్వస్థలం విశాఖకు తరలిస్తుండగా బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.