తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పింఛన్​ కోసం వచ్చి వృద్ధురాలు మృతి - నారాయణపేట జిల్లా సమాచారం

ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్​ కోసం వచ్చిన ఓ వృద్ధురాలు కన్నుమూసింది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ఈ ఘటన జరిగింది.

An old women died in narayanapeta dist to came for asara pension to dhanwad
పింఛన్​ కోసం వచ్చి వృద్ధురాలు మృతి

By

Published : Nov 17, 2020, 7:32 PM IST

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన మద్దెలి నర్సమ్మ(82) ఆసరా పింఛన్ కోసం వచ్చి మరణించింది. ఈనెల గడువు ఈరోజే ముగుస్తుందని చెప్పడంతో హైదరాబాద్ నుంచి ఉదయమే ధన్వాడకు వచ్చింది. లబ్ధిదారులు అధికంగా ఉండడంతో వరుసలో పుస్తకం పెట్టి... ఓ చెట్టు కింద కూర్చున్న చోటే సృహతప్పి పడిపోయింది.

ఈ విషయాన్ని వెంటనే గమనించిన ఇతరులు వృద్ధురాలిని ఆటోలో స్థానిక పీహెచ్​సీకి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:అన్న మృతి.. తమ్ముడికి తీవ్ర గాయాలు...

ABOUT THE AUTHOR

...view details