తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు! - నిజామాబాద్‌ వృద్ధురాలిహత్య

తిర్మన్‌పల్లికి చెందిన ఎల్లవ్వ నిజామాబాద్‌కు బయల్దేరింది. అదే బస్సులో భార్యాభర్తలు ఎల్లయ్య, నర్సవ్వలు ఉన్నారు. ఎల్లవ్వ ఇంటి పక్కనే వీరూ ఉంటారు. పరిచయస్థులు అవడం వల్ల సులభంగా మాయమాటలు చెప్పి ఎల్లవ్వను తమ దారిలోకి తెచ్చుకున్నారు. నిజామాబాద్‌లో తమ కుమార్తె అద్దెకు తీసుకున్న ఇంటికి ఎల్లవ్వను తీసుకెళ్లారు. రాత్రికి రాత్రే చంపేసి.. ఆ ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఐదారు రోజులు అదే ఇంట్లో ఉండి.. ఏమీ తెలియనట్లు తిర్మన్‌పల్లికి వెళ్లారు.

an old woman murdered for jewellery in nizamabad
వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు!

By

Published : Dec 25, 2020, 8:10 PM IST

బంగారు ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన ఎల్లవ్వ(70) హత్యకు గురైంది. ఎల్లవ్వ మందుల కోసం అప్పుడప్పుడూ నిజామాబాద్‌కు వచ్చి వెళ్తుంటుంది. ఈనెల 11న అదే విధంగా ఇంట్లోంచి బయల్దేరి బస్సులో నిజామాబాద్‌కు వెళ్లింది.

ఐదారు రోజులు అదే ఇంట్లో..

ఎల్లవ్వ ఇంటి సమీపంలో అద్దెకుండే భార్యాభర్తలు ఎల్లయ్య, నర్సవ్వలు అదే బస్సులో నిజామాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి వృద్ధురాలిని నిజామాబాద్‌లో తమ కుమార్తె అద్దెకు తీసుకున్న కోటగల్లిలోని ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి వృద్ధురాలిని హత్య చేసి ఆ ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఐదారు రోజులు అదే ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత తిర్మన్‌పల్లికి వెళ్లిన నిందితులు.. తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

వృద్ధురాలి ఆచూకీ కోసం వెతికిన కుటుంబ సభ్యులు.. ఈనెల 14న ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటికి తీసుకొచ్చిన రోజు నిందితుల ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో వృద్ధురాలు మాట్లాడింది. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా చిరునామా కనుక్కుని నిజామాబాద్‌కు వచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.

నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వృద్ధురాలికి సంబంధించిన రెండు తులాల బంగారు ఆభరణాల కోసమే నిందితులు హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:గంటన్నరలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details