తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: ఇంటి నుంచి వెళ్లిపోయింది.. శవమై తేలింది - నిర్మల్​ జిల్లా నేర వార్తలు

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వృద్ధురాలు శవమై తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

An old woman commits suicide in Nirmal district
విషాదం: ఇంటి నుంచి వెళ్లిపోయింది.. శవమై తేలింది

By

Published : Sep 6, 2020, 9:06 AM IST

నిర్మల్​ జిల్లా నర్సాపూర్(జి) మండలం టెంబుర్ని గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది నిమ్మల గంగవ్వ అనే వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది.

టెంబుర్ని గ్రామానికి చెందిన గంగవ్వ.. కుటుంబ కలహాల నేపథ్యంలో 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుమారుడు నిమ్మల శ్రీధర్​ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం అర్లీ(కె) సుద్ధవాగులో ఓ వృద్ధురాలు శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జాలర్ల సాయంతో శవాన్ని బయటకు తీశారు. మృతురాలు నిమ్మల గంగవ్వగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.. అమానుషం... భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details