తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చేపల వేటకు వెళ్లి.. నీట మునిగి వృద్ధుడు మృతి - siripuram yadaiah died while fishing latest News

చేపల వేటకు వెళ్లిన వృద్ధుడు నీట మునిగి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అమ్మనబోలులో చోటు చేసుకుంది.

చేపల వేటలో అపశ్రుతి.. నీట మునిగి వృద్ధుడు మృతి
చేపల వేటలో అపశ్రుతి.. నీట మునిగి వృద్ధుడు మృతి

By

Published : Sep 19, 2020, 2:47 PM IST

Updated : Sep 19, 2020, 8:00 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన సిరిపురం యాదయ్య (65) గ్రామంలోని వాగులో చేపల వేటకు వెళ్లారు. వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతును అంచనా వేయలేక ముందుకు వెళ్లారు. లోతు ప్రాంతంలో మునిగి కొద్ది దూరం కొట్టుకుపోయాడు.

కంపచెట్లలో చెక్కి..

అనంతరం కంపచెట్లలో చిక్కుకున్నారు. గమనించిన యువకులు తాడు సహాయంతో బయటకు లాగారు. అప్పటికే యాదయ్య మరణించారు. మృతుడు పట్ల ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : 'అటువైపు వెళ్లకండి... అక్కడ పులి తిరుగుతోంది'

Last Updated : Sep 19, 2020, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details