సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు వసతిగృహంలో సిద్దిపేటకు చెందిన ఆర్.వెంకటరామన్(62) మృతి చెందాడు. తాను ఉద్యోగం కోసం నగరానికి వచ్చానని చెప్పి ఒక గది అద్దెకు తీసుకున్నట్లు వసతి గృహ నిర్వాహకుడు లక్ష్మీకాంత్ తెలిపాడు. బుధవారం ఉదయం వెంకటరామన్‌ను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా.. అతను స్పందించకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధరించారు.
వసతి గృహంలో అనారోగ్యంతో వృద్ధుడు మృతి
కొద్దిరోజులుగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అనారోగ్యం కారణంగానే వెంకటరామన్ మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వేపూరి లక్ష్మీకాంత్ మూడు సంవత్సరాలుగా వెస్ట్ మారేడుపల్లి శివఅరుణ కాలనీలో శ్రీరామ వసతిగృహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నెల 8న సిద్దిపేటకు చెందిన ఆర్.వెంకటరామన్(62) ఒక గది అద్దెకు తీసుకున్నాడు. అప్పటినుంచి గదిలోనే ఉంటున్న వెంకటరామన్ అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఈనెల 27 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి.. వసతిగృహానికి తిరిగి వచ్చిన వెంకటరామన్‌ను ఆరా తీయగా తన కిడ్నీలలో సమస్య ఉందని చెప్పాడు. అనారోగ్యం కారణంగానే వెంకటరామన్ మృతిచెంది ఉంటాడని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మారేడుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:72 గంటల్లో హత్య కేసును ఛేదించిన చైతన్యపురి పోలీసులు