అదుపుతప్పిన అంబులెన్స్... డ్రైవర్‌కు స్వల్పగాయాలు - accident news
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ వద్ద గల టోల్‌ప్లాజా వద్ద ఓ అంబులెన్స్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
ambulance caught accident at dilavarpur toll plaza
అత్యవసర సేవలందించే అంబులెన్స్ అనుకోకుండా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం వద్ద గల టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల అదుపుతప్పిన వాహనం టోల్‌ప్లాజా రక్షణ రాడ్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. అంబులెన్స్ డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.