కారులో నిషేధిత అంబర్ ప్యాకెట్లు, గంజాయి తరలిస్తున్న ముఠాను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు సీఐ మాధవి వెల్లడించారు. కారులో అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో సిర్సపల్లి అడ్డదారి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. సమూరు రూ. 2 లక్షల విలువ చేసే 10 సంచుల అంబర్, 750 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్ - cannabis illegal transport gang arrested by huzurababd police
నిషేధిత అంబర్ ప్యాకెట్లు, గంజాయిని కారులో అక్రమంగా తరలిస్తున్న నిందితులు హుజూరాబాద్ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. సుమారు రూ. 2 లక్షల విలువ చేసే మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మాధవి వెల్లడించారు.
![గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్ amber packets and cannabis illegal transport gang arrested by huzurababd police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8092926-961-8092926-1595199501150.jpg)
మారకద్రవ్యాల అక్రమ రవాణ చేస్తున్న ముఠా అరెస్ట్
నిందితులు హుజూరాబాద్‌కు చెందిన కాపర్తి అనిల్‌కుమార్, గందె సాయి, కొలిపాక శ్రీనివాస్, గోదావరిఖనికి చెందిన కొలనుపాక శ్రీధర్, గుడికందులు అజేందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.
ఇదీ చూడండి:బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?
TAGGED:
AMBER, GANJAAYI PATTIVETHA