హైదరాబాద్ అల్వాల్‌లో రాత్రివేళలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసై.. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నలుగురు సభ్యుల ముఠా దొంగతనాలకు పాల్పడ్డారని పేట్ బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు తెలిపారు. నిందితుల నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చోరీలు.. దొంగల ముఠా అరెస్ట్ - theft news in Hyderabad
రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు తెలిపారు.
హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు
జవహర్‌నగర్‌కు చెందిన సంపంగి మహేశ్, దేవేందర్, సాయిలు, బోరబండకు చెందిన జశ్రియ నలుగురు సభ్యుల ముఠాగా ఏర్పడి ఇళ్లలో దొంగతనం చేసినట్లు సీసీటీవీ ద్వారా అల్వాల్ పోలీసులు గుర్తించారు. వీరు దొంగలించిన ఆభరణాలను జశ్రియ.. వ్యాపారుల వద్ద విక్రయించేవాడని తెలిపారు. బాలానగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో ముఠాను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ నరసింహారావు చెప్పారు.