ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటితో పాటు పలు రాజకీయ పార్టీల రాస్తారోకో పిలుపు దృష్ట్యా రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ, వరంగల్ నుంచి వచ్చే వాహనదారులు వివిధ ప్రాంతాలకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు - Hyderabad Latest News Latest News
ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటి, రాజకీయ పార్టీల రాస్తారోకో దృష్ట్యా రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాలకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఉప్పల్-మేడిపల్లి, ఎల్బీ నగర్-అబ్దుల్లాపూర్ మెట్ వైపు వెళ్లొద్దని తెలిపారు.
రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధింపు
హైదరాబాద్ నుంచి విజయవాడ, వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు ఉప్పల్-మేడిపల్లి, ఎల్బీ నగర్-అబ్దుల్లాపూర్ మెట్ వైపు వెళ్లొద్దని తెలిపారు. ఓఆర్ఆర్లోపల ప్రయాణించేవారు ప్రత్నమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వెల్లడించారు.
ఇదీ చూడండి:సినిమాలో జోకర్ని.. నిజ జీవితంలో హీరోని: బాబుమోహన్