బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల పైనే కొందరు దాడికి దిగిన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ఉండవల్లి మండల కేంద్రంలోని అలంపూర్ చౌరస్తా కూడలిలో జరిగింది. ఈ ఘర్షణలో ఓ హోంగార్డు చేయి విరిగిపోయింది. ఇద్దరిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు మరో ముగ్గురికోసం గాలిస్తున్నారు.
మద్యం ప్రియుల వీరంగం.. పోలీసులపై దాడి - పోలీసులపై దాడికి దిగిన మందు బాబులు
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న మందుబాబులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పలువురిపై దాడులు చేస్తూ స్థానికులకు భయం కలిగిస్తున్నారు. తాజాగా రెచ్చిపోయిన కొందరు మద్యం ప్రియులు ఏకంగా పోలీసులపైనే దాడికి దిగిన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది.
![మద్యం ప్రియుల వీరంగం.. పోలీసులపై దాడి alcohol lovers attack on police in jogulamba gadwal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10176421-436-10176421-1610180315114.jpg)
కర్నూలు నుంచి అలంపూర్ మండల కేంద్రానికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు అలంపూర్ చౌరస్తాలో మద్యం సేవించారు. అనంతరం ఓ హోటల్‌కు వెళ్లి భోజనం అడిగారు. నిర్వాహకురాలు భోజనం లేదని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్నవారు హోటల్ సిబ్బందిలో దురుసుగా ప్రవర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అందులో ముగ్గురు పారిపోగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దొరికిన వారిని ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మందుబాబులకు, పోలీసులకు మద్య పెనుగులాట జరిగి ఆటో బోల్తా పడింది. ఈ ఘర్షణలో హోంగార్డ్ మద్దిలేటికి చేయి విరిగిపోగా మందుబాబులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ దీక్ష