తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బతుకు దెరువుకోసం వచ్చి.. బెట్టింగ్‌కు బలి - man sucide in hyderabad dwarakapuri colony

సోనుకుమార్ అనే వ్యక్తి ఝార్ఖండ్‌ నుంచి వలస వచ్చాడు. కొబ్బరి బొండాలు విక్రయిస్తున్నాడు. ఐపీఎల్‌ బెట్టింగ్‌కు అలవాటయ్యాడు. ఆర్థికంగా చితికిపోయాడు. చావే శరణ్యమనుకున్నాడేమో.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పంజాగుట్టలోని ద్వారకపూరి కాలనీలో చోటుచేసుకుంది.

after-loosing-huge-money-in-ipl-betting-man-sucide-in-hyderabad
బతుకు దెరువుకోసం వచ్చి.. బెట్టింగ్‌కు బలి

By

Published : Nov 3, 2020, 8:41 PM IST

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. బతుకు దెరువుకోసం ఝార్ఖండ్‌ నుంచి నగరానికి వలస వచ్చిన 19 ఏళ్ల సోనుకుమార్ యాదవ్‌ కొబ్బరి బొండాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. పంజాగుట్టలోని ద్వారకపూరి కాలనీలో నివాసముంటున్నాడు.

మిత్రులతో కలిసి ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి సోనుకుమార్ తీవ్రంగా నష్టపోయాడు. ఇవాళ ఉదయం అతను నివాసముంటున్న ఇంట్లోనే బాత్రూంలో కిటికి చువ్వలకు ఓ వస్త్రంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని సోదరుడు అర్జున్‌కుమార్ యాదవ్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:బోల్తా పడిన ప్రైవేట్ బస్సు... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details