సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆఫ్రికన్ ముఠా అరెస్ట్ - cybercrime latest updates
14:09 January 08
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆఫ్రికన్ ముఠా అరెస్ట్
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆఫిక్రన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. లైబీరియా, ఘనా, నైజీరియాకు చెందిన ఐదుగురు సభ్యులు.. వేర్వేరు అవసరాలు చూపిస్తూ దేశానికి వచ్చారని పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.
అనారోగ్య సమస్యలు అని వచ్చి ఇక్కడ మోసాలకు పాల్పడుతూ.. ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారని వివరించారు. ఆన్‌లైన్‌లో పరిచయాలు చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని.. దిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నిందితులను అరెస్టు చేశామని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా డ్రైరన్- త్వరలోనే పౌరులకు టీకా