తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఖరీదైన మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలతో అక్రమ వ్యాపారం - Adulterated alcohol sales in khammam district

ఖరీదైన మద్యం బ్రాండ్ల సీసాల్లో చీప్​ లిక్కర్, నాసిరకం మద్యం కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఖమ్మం ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా జోరుగా వ్యాపారం సాగిస్తున్న వైనాన్ని గమనించి.. పక్కా నిఘాతో అరెస్టు చేశారు.

Adulterated alcohol sales in branded wine bottles
ఖరీదైన మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలతో అక్రమ వ్యాపారం

By

Published : Dec 3, 2020, 4:32 PM IST

ఖరీదైన మద్యం బ్రాండ్ల ఖాళీ సిసాల్లో చీప్‌ లిక్కర్లు, నాసిరకం మందులు కలిపి అమ్ముతున్న వ్యక్తిని ఖమ్మంలో ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. బ్రాండ్ల ధరలకంటే నాలుగైదు వందల రూపాయల తక్కువకు అమ్ముతూ.... మద్యం ప్రియులను బురిడీ కొట్టిస్తున్న శీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నాలుగు నెలలుగా ఖమ్మం నగరంలో జోరుగా అక్రమ వ్యాపారం సాగిస్తున్న వైనాన్ని గమనించిన ఆబ్కారీ పోలీసులు... పక్కా నిఘా పెట్టి పట్టుకున్నారు. సీసాల్లో చీప్‌ లిక్కర్‌తో పాటు నీళ్లు, ఇతర శీతల పానీయాలు కలిపి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుడి నుంచి లక్ష విలువైన వివిధ రకాల ప్రీమియం బ్రాండ్లకు చెందిన 65 కల్తీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details