తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య - Adhya father committed suicide

Adhya father committed suicide at bhongir railway station
ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

By

Published : Jul 11, 2020, 2:55 PM IST

Updated : Jul 11, 2020, 4:36 PM IST

14:53 July 11

ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఈనెల 2న హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడి ఆద్య తండ్రి కల్యాణ్ బలవన్మరణం చెందాడు. ఆత్మకూరు(ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా కల్యాణ్ పనిచేసేవాడు. ఇటీవల కల్యాణ్ కుమార్తె ఆద్యను కరుణాకర్ అనే వ్యక్తి హత్య చేశాడు. 

అసలు ఏం జరిగిందంటే..?

యాదాద్రి భువనగిరికి చెందిన సూరనేని కల్యాణ్​రావు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష 2011లో ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఆద్య అనే ఐదేళ్ల పాప ఉంది. మూడేళ్లుగా వీరు పోచారం మున్సిపాలిటీలోని ఇస్మాయిల్‌ఖాన్ ‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.

సెల్‌ఫోన్‌ వాయిదాల లావాదేవీల విషయంలో రెండేళ్ల క్రితం కరుణాకర్‌ అనే వ్యక్తితో అనూషకు ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త విధులకు వెళ్లిన అనంతరం కరుణాకర్‌ అనూష వద్దకు వచ్చేవాడు. అతడి వెంట అప్పుడప్పుడూ అతడి స్నేహితుడు రాజశేఖర్‌ కూడా ఉండేవాడు. ఈ క్రమంలో అతడితోనూ అనూష వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనంతరం మెల్లమెల్లగా కరుణాకర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది.

గత 3నెలలుగా అనూష తనతో సరిగ్గా లేకపోవడం గమనించిన కరుణాకర్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అనూష సంగతి తేల్చుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ రాజశేఖర్‌ చెప్పులు, బైక్‌ కనిపించడం వల్ల కోపంతో ఊగిపోతూ తలుపులు బాదాడు. అతడి రాకను గమనించిన అనూష.. రాజశేఖర్‌ను స్నానాలగదిలో దాచి, తలుపులు తీసింది. ఇంట్లోకి వచ్చిన కరుణాకర్‌, రాజశేఖర్‌ను బయటికి రాకపోతే ఆద్యను చంపేస్తానంటూ అరిచాడు. అయినా రాజశేఖర్‌ రాకపోవడం వల్ల.. కరుణాకర్‌ కత్తి తీసుకుని చిన్నారి గొంతు కోసేశాడు. ఈ ఘటనలో చిన్నారి ఆద్య మరణించింది. కుమార్తె మృతి, భార్య వివాహేతర సంబంధం కొనసాగించడంతో మనస్తాపం చెంది కల్యాణ్​ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు చిన్నారి హత్య జరిగిన రోజు ఆసుపత్రిలో చేరిన ఆద్య తల్లి అనూష, రాజశేఖర్ డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత కథనాలు:

  1. చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు అరెస్టు
  2. తల్లి ఫేస్​బుక్ స్నేహానికి ఐదేళ్ల కూతురు బలి
  3. ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు
Last Updated : Jul 11, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details