మెదక్ మాజీ అదనపు కలెక్టర్ నగేష్... వెల్దుర్తి మండలం మాసాయిపేటలో అక్రమంగా ఇనాం భూములు కొనుగోలు చేసిన విషయంలో రైతులను అనిశా అధికారులు విచారిస్తున్నారు. నగేష్ పెద్ద మొత్తంలో రైతుల ఇనాం భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
చౌకకు ఇనాం భూములు కొనుగోలు చేసిన మాజీ అదనపు కలెక్టర్! - మెదక్ మాజీ అదనపు కలెక్టర్ నగేష్ కేసు
మెదక్ మాజీ అదనపు కలెక్టర్ నగేష్... పెద్ద మొత్తంలో రైతుల ఇనాం భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో భూముల కొనుగోలు చేసిన విషయంలో రైతులను అనిశా అధికారులు విచారిస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించిన స్థిరాస్తి వ్యాపారులు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
nagesh
భూములు కొనుగోలు చేయడంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన తూప్రాన్ పట్టణానికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు ప్రభాకర్, శివరాజ్ ఇళ్లలో అనిశా సీఐ రవీందర్ ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి :గ్రేటర్లో మంచి పేరుంది.. కనీసం 91 సీట్లు గెలుస్తాం: కేటీఆర్