139 మంది అత్యాచారం’ కేసులో సీసీఎస్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విచారణాధికారిగా ఏసీపీ శ్రీదేవిని నియమించారు. కొన్ని రోజుల కిందట మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తొమ్మిదేళ్లలో తనపై 139 మంది అత్యాచారం చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
139 మంది అత్యాచారం కేసులో విచారణాధికారిగా ఏసీపీ శ్రీదేవి - ACP Sridevi is the investigating officer in the 139 member rape case
తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పెట్టిన కేసు విచారణను సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ మేరకు దర్యాప్తు బాధ్యతను ఏసీపీ శ్రీదేవి నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అప్పగించారు.

139 మంది అత్యాచారం కేసులో విచారణాధికారిగా ఏసీపీ శ్రీదేవి
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 42 పేజీల ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ కేసును ఉన్నతాధికారులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు బాధ్యతను ఏసీపీ శ్రీదేవి నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అప్పగించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.