మహిళపై యాసిడ్ దాడి.. పరారీలో నిందితుడు - జగిత్యాల తాజా వార్తలు
![మహిళపై యాసిడ్ దాడి.. పరారీలో నిందితుడు Acid attack on a woman in jagityal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9984356-thumbnail-3x2-acid.jpg)
21:19 December 23
జగిత్యాల జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
జగిత్యాల జిల్లాలో ఓ మహిళపై యాసిడ్ దాడి అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో స్వాతి అనే వితంతుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధితురాలకి మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కూలీ పని చేసుకుని జీవించే స్వాతి వేరే గ్రామానికి వెళ్లేందుకు... బస్టాండ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోసి పరారైనట్లు చెబుతున్నారు. కాగా ఈమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:ప్రయాణిస్తున్న కారులో మంటలు... దగ్ధం