హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు షబ్బీర్ అనే యువకుడు ఆత్యహత్యాయత్నం చేశాడు. గజిమిల్లత్ ప్రాంతానికి చెందిన షబ్బీర్... చరవాణీల దొంగతనం కేసులో స్టేషన్కు పట్టుకొచ్చారు. అతన్ని విచారించగా... అతని వద్ద చిన్న కత్తి, వేరే ప్రాంతంలో దొంగిలించిన ఫోన్ దొరికింది. ఫోన్ తీసుకొని మరుసటి రోజు రావాల్సిందిగా పోలీసులు చెప్పి పంపించారు.
బయటకు వెళ్లి కాసేపటి తర్వాత వచ్చిన షబ్బీర్... పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అంతేకాకుండా బయటకు పరుగులు తీశాడు. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పి, ఆసుపత్రికి తరలించారు. సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసుల్లో జైలుశిక్ష అనుభవించినట్టు సీఐ రుద్ర భాస్కర్ తెలిపారు. అయినా మారకుండా... ప్రజలను, పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
పోలీసు స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం - చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ ముందు నిందితుడి ఆత్యహత్యయత్నం
పోలీసులను భయభ్రాంతులకు గురిచేసేందుకు... ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని, పరుగులు తీసిన ఘటన... చంద్రాయణగుట్ట పీఎస్ వద్ద చోటుచేసుకుంది. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పి, ఆసుపత్రికి తరలించారు.
పోలీసు స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
ఇదీ చూడండి:కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు
TAGGED:
accused suicide attempt