తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హేమంత్​ హత్య కేసులో నిందితుల విచారణ - అవంతి, హేమంత్​ వార్తలు

రాష్ట్రంలో సంచలనం రేపిన హేమంత్​ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితులు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్​ రెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. వారిని చర్లపల్లి జైలు​ నుంచి గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​కు తీసుకొచ్చి విచారించారు. తమకు రక్షణ కల్పించలంటూ అవంతి, ఆమె అత్త, మామ సీపీకి వినతి పత్రం అందించారు.

accused hearing in hemanth murder case in hyderabad
హేమంత్​ హత్య కేసులో నిందితుల విచారణ

By

Published : Sep 30, 2020, 5:13 PM IST

హేమంత్​ హత్య కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ప్రధాన నిందితులు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్​ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను ఉదయం జైలు​ నుంచి గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​కు తీసుకొచ్చి విచారించారు. హత్య జరిగిన రోజు పరిణామాలపై ప్రధానంగా విచారిస్తున్నట్లు తెలిసింది.

గతంలో అవంతి, హేమంత్​ మధ్య ప్రేమ విషయంలో అవంతిని ఆమె కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టిన దానిపై విచారించారు. తమకు ప్రాణహాని ఉందని అవంతి, ఆమె అత్త, మామ నిన్న డీసీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ రోజు సీపీని కలిసి తమకు రక్షణ కల్పించాలంటూ వినతి పత్రం అందించారు. ఫాస్ట్​ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలన్నారు. సానుకూలంగా స్పందించిన సీపీ సజ్జనార్​ హేమంత్​ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు.

ఈ కేసులో ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ఏర్పాటు చేయాలని సీపీ సజ్జనార్​ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఆ లోపు చార్జీషీట్​ తయారు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని సీపీ అన్నారు.

ఇదీ చదవండి:చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

ABOUT THE AUTHOR

...view details