ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన జ్ఞానేశ్వర్ హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌ను అదే మండలం సుంకిడి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు విందుపేరుతో పిలిచి ఈనెల ఆరో తేదీన హత్య చేశారు. అనంతరం మహరాష్ట్రలోని కన్వట్ అటవీప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు.
ఆదిలాబాద్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితున్ని అదుపులోకి తీసుకోగా, మిగిలిన ముగ్గురిని పట్టుకున్నారు. వ్యక్తిగత కక్షలతోనే హత్యకు పాల్పడ్డారని మీడియా సమావేశంలో జిల్లాఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు.
ఆదిలాబాద్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఈనెల 8న ఆయన కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అదే రోజు ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులైన షిందే అజ్జు, గోవింద్‌రావు, రాంకిషన్‌లను ఈరోజు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరంతా వ్యక్తిగత కక్షలతోనే హత్యకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు.