ఈ నెల 21న హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మధురానగర్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సరళ కోడలే చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోడలు, ఆమె సోదరుడితో కలిసి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2కిలోల బంగారం, ఆరున్నర కిలోల వెండి సహా మొత్తం 80 లక్షల రూపాయల విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే చోరీకి కారణమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
బోయిన్పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ - బోయిన్పల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్లో ఈ నెల 21న జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు దొంగలించిన వస్తువులతో పాటు కారు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
![బోయిన్పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4892818-thumbnail-3x2-vysh.jpg)
బోయిన్పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్
బోయిన్పల్లి చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్
ఇదీ చదవండిః సికింద్రాబాద్లో భారీగా నగదు, ఆభరణాల చోరీ