హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సూట్‌కేసులో లభించిన మృతదేహం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. చాంద్రాయణగుట్టకు చెందిన మృతుడు రియాజ్‌ను అతని మిత్రులే హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని డీసీపీ పేర్కొన్నారు.
సూట్‌కేసు హత్య: స్నేహితులే హత్య చేశారు.. - Shamshabad dcp dcp on Suitcase murder
రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సూట్‌కేసులో లభించిన మృతదేహం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు
సూట్‌కేసు హత్య: నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
గౌస్ నగర్‌లో నివసించే మృతుడు రియాజ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూనే చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు మైనర్లతో స్నేహం ఏర్పడింది. వీరు ముగ్గురు కలిసి చిల్లర దొంగతనాలు చేసిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకునే వారు. ఈ మధ్య కాలంలో మృతునికి చెందిన ఆటో బ్యాటరీని ఇతని మిత్రులే దొంగలించారని అనుమానించి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారనే నెపంతో రియాజ్‌కు మద్యం తాగించి హత్య చేసి సూట్‌కేసులో కుక్కి రాజేంద్రనగర్ డెయిరీఫాం వద్ద పడేసి వెళ్లారని డీసీపీ వివరించారు.
- ఇదీ చూడండి :వాట్సాప్,టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?