నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని సహార ఇండియా పరివార్ బ్యాంక్ ముందు డిపాజిట్ దారులు ఆందోళన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాల క్రితం వేల రూపాయలు డిపాజిట్ చేశామని.. డిపాజిట్ కాలపరిమితి దాటిపోయినా తిరిగి డబ్బులు చెల్లించకుండా సహారా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.
బ్యాంక్ ముందు డిపాజిట్ దారుల ఆందోళన - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు
ఓ బ్యాంకు ముందు డిపాజిట్ దారులు ఆందోళనకు దిగిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగింది. డిపాజిట్ కాలపరిమితి దాటిపోయినా డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంక్ ముందు డిపాజిట్ దారుల ఆందోళన
కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే తిరిగి ఇవ్వడం లేదన్నారు. ధర్నా చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల కోపోద్రిక్తులైన బాధితులు బ్యాంకు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాధితులుు, మేనేజర్‌ను అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సీసీ కెమెరాల టెండరింగ్‌లో మాయజాలం