ద్విచక్రవాహనం వేగంగా దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. తాడ్బండ్ నుంచి బోయిన్పల్లి వైపు వెళ్తున్న సమయంలో మలుపు వద్ద యాక్టివా వాహనంపై ముగ్గురు యువకులు వేగంగా వెళ్తుండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది.
డివైడర్ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి - హైదరాబాద్ లేటెస్ట్ అప్డేట్స్
సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలో డివైడర్ను ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
![డివైడర్ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి accident took place at bowenpally in secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9631198-401-9631198-1606095301833.jpg)
డివైడర్ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి
ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా ముగ్గురు యువకులు రోడ్డుపై పడడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.