ఏపీ కృష్ణా జిల్లా కంచికచర్ల శివారులో ప్రమాదం జరిగింది. సీఎం భద్రతా విభాగంలో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న నరసింహారావు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పారు. వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నరసింహారావు ఎడమ కాలు విరిగింది. వాహనంపై ఉన్న యువతికి గాయాలయ్యాయి.
ఏపీ సీఎం భద్రతా విభాగం ఆర్ఎస్ఐకి గాయాలు - accident to cm jagan security officer
ఏపీ కృష్ణా జిల్లా కంచికచర్ల శివారులో జరిగిన ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో.. ఏపీ సీఎం భద్రతా విభాగం ఆర్ఎస్ఐ నరసింహారావు ఎడమ కాలు విరిగింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏపీ సీఎం భద్రతా విభాగం ఆర్ఎస్ఐ
స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరినీ.. నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్ఎస్ఐ నరసింహారావు విధులు నిర్వహించి స్వస్థలమైన మధిరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:కదలని బస్సులు.. తెరుచుకోని దుకాణాలు...