తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓఆర్​ఆర్​పై రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి - road accident news

శంషాబాద్​ కొత్వాల్​గూడ ఓఆర్​ఆర్​పై ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

accident on shamshabad orr
ఓఆర్​ఆర్​పై రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

By

Published : Nov 25, 2020, 5:50 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓఆర్​ఆర్​పై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమా లేక మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:పాత కక్షలతో జవాన్​ దాడి.. రిమాండ్​కి తరలింపు

ABOUT THE AUTHOR

...view details