సంగారెడ్డి జిల్లాలో కల్హేర్ మండల పరిధిలోని బాచేపల్లి శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నారాయణ్‌ఖేడ్ ఆస్పత్రికి తరలించారు. డెంగ్లూర్ నుంచి హైదరాబాద్‌లోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - lorry
సంగారెడ్డి జిల్లా బాచేపల్లి శివారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, తుఫాన్ వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం