విషాదం: ఓఆర్ఆర్పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం - accident at pedda amberpet
12:17 July 07
ఓఆర్ఆర్పై ఏపీ మంత్రి బాలినేని వాహనం బోల్తా.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ పేలి.. బొలెరో వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ఉన్న పాపారావు అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలిపారు.
ఇదీచూడండి: ములుగు జిల్లాలో అమానుషం.. పనులు అడ్డుకున్నందుకు జేసీబీతో దాడి