సికింద్రాబాద్ పరిధి అల్వాల్‌లోని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీకి చెందిన పలువురు యువకులు మద్యం మత్తులో కారు నడుపుతూ హల్చల్ చేశారు. నాగిరెడ్డికాలనీలో ఓ ఇంటి గోడను ఢీకొట్టారు. వేగంగా ఉన్న కారు గోడపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటి గోడపైకి దూసుకెళ్లిన కారు - nagireddy colony
మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ ఓ ఇంటిగోడను ఢీకొట్టారు. వేగంగా ఉన్న కారు గోడపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
![ఇంటి గోడపైకి దూసుకెళ్లిన కారు accident at nagireddy colony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7093279-181-7093279-1588834170213.jpg)
ఇంటి గోడపైకి దూసుకెళ్లిన కారు
అనంతరం యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు లభించడం గమనార్హం.