యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కందిగడ్డతండా శివారులో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రభుత్వ బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. వెనక టైర్ పేలడం వల్ల అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎస్సై మృతి - latest accident news on accident at kandiguttathanda rsi died
బొలెరో వాహనం బోల్తా పడి ఆర్ఎస్సై మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![రోడ్డు ప్రమాదంలో ఆర్ఎస్సై మృతి accident at kandiguttathanda rsi died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038944-790-7038944-1588483198754.jpg)
వాహనం బోల్తా.. ఆర్ఎస్సై మృతి
మృతుడు వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఆర్ఎస్సైగా పనిచేస్తున్న వి.కర్ణుడుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.