రోడ్డు ప్రమాద ఘటనలో క్షతగాత్రుడిని పక్కన పెట్టి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్థానికులు తీవ్రంగా చితకబాదారు. ఆర్టీసీ బస్సు టీవీఎస్ మోపెడ్‌ను ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సిరిసిల్ల రోడ్డులో కరీంనగర్ నుంచి కామారెడ్డి వస్తున్న కరీంనగర్ ఒకటో డిపో బస్సు టీవీఎస్ మోపెడ్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మోపెడ్‌పై వెళ్తున్న పసుల పోషయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని డ్రైవర్ మల్లయ్యను స్థానికులు చితక్కొట్టారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన స్థానికులు - kamareddy district latest crime news
కారణం తెలుసుకోకుండా మానవత్వం మరిచి ప్రజలు క్రూరత్వం ప్రదర్శించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు టీవీఎస్ మోపెడ్‌ను ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. తన తప్పేమీ లేదని డ్రైవర్ ఎంత మొత్తుకున్నా వినకుండా స్థానికులు చితక్కొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
![ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన స్థానికులు accident at kamareddy district and Locals Beat RTC bus driver](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9354469-406-9354469-1603964820273.jpg)
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన స్థానికులు
తన తప్పేమీ లేదని చెప్పినా వినిపించుకోకుండా డ్రైవర్‌పై ఇష్టానుసారం దాడికి పాల్పడ్డారు. దెబ్బలకు తట్టుకోలేక పారిపోవాలని ప్రయత్నించినా వదలలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరగడానికి తన తప్పేమీ లేదని.. మోపెడ్‌పై వస్తున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ బస్సుకు ఎదురుగా వచ్చాడని మల్లయ్య తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని ఓ ప్రయాణికుడు తెలిపారు.