నల్గొండ జిల్లా దేవరకొండలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బైకుపై ఉన్న చందర్, స్కైలాబ్లు అక్కడికక్కడే మృతి చెందారు.
మద్యం మత్తులో లొల్లి.. పరామర్శకు వస్తున్న ఇద్దరు మృతి - latest news on accident at devarakonda bus stand
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
బైకును ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి
కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకల వద్ద గల ఓ బెల్టు షాప్లో కొందరు యువకులు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలు కావడం వల్ల దేవరకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బంధువులు చందర్, స్కైలాబ్లు గుడితండా నుంచి దేవరకొండకు వస్తుండగా.. దేవరకొండ బస్స్టాండ్ వద్ద వెనక నుంచి వస్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చందర్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.