నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెరుకూరులో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య (40) మృతి చెందారు. ఎల్లయ్య హైదరాబాద్ సమీపంలోని కోళ్ల ఫారంలో తన కుటుంబంతో కలిసి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి
ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెరుకూరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి
సోమవారం ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఇదీ చదవండి:ఆ బంగారం ముంబయి, జయపురకు వెళ్తోంది..!