మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై అతివేగంగా వస్తున్న వ్యక్తి గోడకు ఢీ కొని మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన టీవీ మెకానిక్ కృష్ణవర్ధన్ గురువారం ఉదయం మద్యం సేవించి వాహనం నడుపుతూ స్థానిక ప్రైవేటు పాఠశాల వద్ద గోడకు ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యం మత్తులో అతి వేగం.. గోడకు ఢీకొని దుర్మరణం - bike accidents in secunderabad
మద్యపానం, అతి వేగంతో ఓ వ్యక్తి నిండు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు.. గాంధీ ఆస్పత్రికి తరలించారు.
![మద్యం మత్తులో అతి వేగం.. గోడకు ఢీకొని దుర్మరణం accident-at-alwal-ps-area-secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9437337-83-9437337-1604558558695.jpg)
మద్యం మత్తులో అతి వేగం.. గోడకు ఢీకొని దుర్మరణం
మద్యం సేవించి వాహనం అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:చెత్త నుంచి కోట్ల విలువైన కరెంటు.. ప్రారంభానికి ముందే రికార్డు