తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారు-ఆటో ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు - yadadri bhuvanagiri district latest news

ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

accident at aleru in yadadri bhuvanagiri district
కారు-ఆటో ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

By

Published : Dec 9, 2020, 5:35 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆలేరు-గుండ్లగూడెం గేటు వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం క్షతగాత్రులను వెంటనే ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం వరంగల్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు.

జనగాం వైపు నుంచి వస్తున్న ఆటోను ఒక్కసారిగా కారు ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మత్తు మందిచ్చి కిడ్నాప్​కు యత్నం.. తప్పించుకున్న బాలుడు

ABOUT THE AUTHOR

...view details