కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఇంట్లో అవినీతి నిరోదక శాఖ సోదాలు నిర్వహించింది. బెట్టింగ్ కేసులో బెయిలు మీద విడుదల చేసేందుకు సుధాకర్ అనే వ్యక్తిని రూ.5లక్షలు డిమాండ్ చేయగా... బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించింది. ముందస్తుగా రూ.1.39 లక్షలు ఇచ్చిన సుధాకర్... నిన్న ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
కామారెడ్డి సీఐ జగదీశ్ ఇంటిపై ఏసీబీ సోదాలు - సీఐ జగదీశ్ ఇంటిపై ఏసీబీ దాడులు
బెట్టింగ్ కేసులో నిందితుడిని బెయిల్ మీద విడుదల చేసేందుకు... సీఐ లంచం డిమాండ్ చేసి ఏసీబీ చిక్కిన ఘటన... కామారెడ్డిలో చోటుచేసుకుంది. నిందితుడి దగ్గర రూ.5 లక్షల డిమాండ్ చేయగా... రూ 1.39లక్షలు ఇచ్చి ఏసీబీని ఆశ్రయించాడు.
కామారెడ్డి సీఐ జగదీశ్ ఇంటిపై ఏసీబీ సోదాలు
ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సీఐ ఇంటి వద్ద నిజామాబాద్ ఇంఛార్జ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఉన్న పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. లంచం డిమాండ్ చేసిన కేసులో సోదాలు చేసినట్టు డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మొబైల్ షాపులో పని చేసే సుజయ్ అనే వ్యక్తి ద్వారా... సీఐ ఈ వ్యవహారం నడిపినట్టు తెలిపారు.
ఇదీ చూడండి:హైదరాబాద్లో 20 లక్షల హవాలా డబ్బు స్వాధీనం